లాకప్‌లో ఖైదీ మృతి.. లైవ్‌లో కుప్పకూలిన స్మగ్లర్.. స్టేషన్‌పై గ్రామస్థుల దాడి - బిహార్ వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16435068-thumbnail-3x2-eeee.jpg)
లాకప్‌లో ఉన్న అక్రమ మద్యం స్మగ్లింగ్ కేసు నిందితుడు అనుమానాస్పద మృతికి సంబంధించిన వీడియో బిహార్‌లోని కాటిహార్ జిల్లాలో కలకలం రేపుతోంది. ప్రాణ్పుర్ స్టేషన్‌లోని లాకప్‌లో ఉన్న ప్రమోద్.. మరో వ్యక్తితో మాట్లాడుతూ అకస్మాత్తుగా మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియో చూసిన గ్రామస్థులు.. పోలీస్‌స్టేషన్‌పైకి దాడికి దిగారు. ఈ ఘటనలో పది మంది పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే వైరల్ అవుతున్న వీడియోపై దర్యాప్తు చేపట్టామని కాటిహార్ ఎస్ఐ జితేంద్ర తెలిపారు.