వద్దన్నా వినిపించుకోలేదు.. వరదలో కొట్టుకుపోయాడు.. వీడియో వైరల్ - భైరవీ నది వరదలో కొట్టుకుపోయిన యువకుడు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16275622-thumbnail-3x2-man-drowning.jpg)
ఝార్ఖండ్ రామ్గఢ్లో ఓ యువకుడు వరద నీటిలో కొట్టుకుపోయాడు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు భైరవీ నది ప్రవాహం పెరిగిపోయింది. దీంతో డ్యామ్ గేట్లను తెరవగా.. సమీప దుకాణాలు, నివాస ప్రాంతాల మీదుగా నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ సమయంలోనే పిప్రాజ్రా గ్రామ నివాసి సంతోష్ మాంఝీ ఆ నీటి ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేశాడు. మరోవైపు దుకాణదారులు, జనం వద్దని వారిస్తున్నా వినిపించుకోకుండా దుస్సాహసం చేశాడు. అలాగే కొట్టుకుపోయాడు. అతడి ప్రస్తుత పరిస్థితి గురించి సమాచారం లేదు.