How to Be Happy Life : లైఫ్ బోర్ కొడుతోంది. రోజంతా ఒకేలా ఉంటుంది. కనీసం ఈరోజైనా కొత్తగా చేద్దాం అని తరచూ మిత్రులతో అంటుంటాం. వాస్తవమే ఎప్పుడూ ఒకేలా ఉంటే ఏం బాగుండదు. వారంలో కనీసం ఒక్కరోజైనా కొత్తగా ఆలోచించి ఆచరిద్దాం. అందరికీ స్ఫూర్తిని పంచుదాం. అది వచ్చే ఆదివారం నుంచే ప్రారంభిద్దాం. ఇందుకు మనం పెద్దగా కష్టపడాల్సిన పనేమీ లేదు. లైఫ్ స్టైల్‌ను కొద్దిగా మార్చుకుంటే సరిపోతుంది. అదేలాగో మీకోసం.
ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్దాం : -
- పోటీ ప్రపంచంలో దొరికే కొద్ది విరామ సమయాన్ని రెస్టారెంట్లు, పబ్బులు, పార్కులకు కేటాయిస్తున్నారు. వీటి వల్ల కలిగే ప్రయోజనం కన్నా ఇబ్బందులే అధికం.
- ఆధ్యాత్మికతను అందిపుచ్చుకుందాం. ఇష్టదైవారాధన కోసం ప్రార్థన మందిరాలకు వెళదాం. అక్కడ ఒక పూట ఆనందంగా ఉందాం. పెద్దల సందేశాలను మన లైఫ్‌కు అన్వయించుకుందాం. అక్కడికి వచ్చే భక్తుల్లోని మంచిని తీసుకుందాం.
- ఆధ్యాత్మిక సందేశాలు, సూక్తులను మన లైఫ్‌లో భాగం చేసుకుంటే మనసు ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది.
మార్పుతో మేలు : -
- ప్రస్తుతం
- ప్రత్యామ్నాయం
- ప్రయోజనం
- ప్రేరణ
పుస్తకాలు, న్యూస్ పేపర్స్ చదువుదాం : -
- ఒక అధ్యయనం ప్రకారం ప్రతి ముగ్గురిలో ఇద్దరు అదే పనిగా సెల్‌ఫోన్ వినియోగిస్తుండగా, వారిలో 11 శాతం మంది బానిసలు అవుతున్నారు. ఇది అనేక సమస్యలకు కారణం అవుతోంది.
- రోజూ ఒక నిర్ణీత టైమ్‌ను ఎంపిక చేసుకుని సెల్‌ఫోన్‌ను పక్కన పెడదాం. పుస్తక పఠనం లేదా న్యూస్‌పేపర్‌ను పూర్తిగా చదువుదాం.
- ఒక రోజులో 20 పేజీలకు తక్కువ కాకుండా చదివితే జ్ఞానంతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని నిపుణులు అంటున్నారు. మెదడు పదునుగా పని చేస్తుంది. న్యూస్‌పేపర్ చదవడం వల్ల నిత్యనూతనంగా ఉంటాం.
సైకిల్‌పై తిరిగొద్దామా? : -
- ఇంటి నుంచి అడుగు బయట వేయడమే ఆలస్యం, బండి ఎక్కి దూసుకెళుతున్నాం. ప్రమాదానికి ఆస్కారం ఉందని తెలిసినా రోడ్ నియమాలను పట్టించుకోం.
- మన స్థాయికి తగ్గ వాహనాలు ఉన్నా వాటికి అప్పుడప్పుడు విరామం ఇద్దాం. చిన్నచిన్న అవసరాలకు సైకిల్ వాడదాం.
- సైకిల్ ఉంటే ఫిట్‌నెస్ కోసం ప్రత్యేకంగా జిమ్ సెంటర్స్‌కు వెళ్లాల్సిన పని ఉండదు. ఇది మనల్ని సంపూర్ణ ఆరోగ్యంగా చేస్తుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది.
పొలానికి వెళ్దాం :
- లీవ్ దొరికితే సినిమా లేదా ఎగ్జిబిషన్‌కు వెళ్దామా అని చాలా మంది ఆలోచన చేస్తుంటారు.
- ఒక్కసారి దగ్గరలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లొద్దాం. పిల్లల్ని తీసుకెళ్దాం. వారికి సాగు పద్ధతులు, రైతన్న విలువ తెలియచేద్దాం.
- పరిశీలించే గుణం, సంఘటితత్వం, వాతావరణం, పంటలపై అవగాహన కలుగుతుంది. మీ పిల్లలకు క్షేత్ర స్థాయి అనుభవం వస్తుంది.
సింగిల్స్ గెట్ రెడీ! 'యాంటీ వాలెంటైన్స్ వీక్' వచ్చేసింది- రోజుకో స్పెషల్ గురూ!