ETV Bharat / state

మీ పిల్లలు ఆన్​లైన్​ గేమ్​లను వదలట్లేదా? - ఇలా చేస్తే అంతా మీ కంట్రోల్​లోనే! - TIPS TO REDUCE ONLINE GAMING HABIT

-పిల్లల్లో వ్యసనంగా మారుతున్న ఆన్​లైన్​ గేమింగ్‌ -భారత్‌లో అలాంటి వారు 19.9 శాతం మంది -గేమింగ్‌ కన్సోల్స్‌లో పేరెంటల్‌ కంట్రోల్‌ వినియోగించాలంటున్న టీజీసీఎస్‌బీ

Tips to Reduce Online Gaming Habit in Children
Tips to Reduce Online Gaming Habit in Children (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2025, 5:02 PM IST

Tips to Reduce Online Gaming Habit in Children: ప్రస్తుత రోజుల్లో స్కూల్​, కాలేజీ నుంచి రావడం ఆలస్యం పిల్లలు చేసే మొదటి పని ఫోన్​ చేతిలోకి తీసుకోవడం. ఫేస్​బుక్​, ఇన్​స్టా అంటూ గంటల తరబడి ఫోన్​ చూసుకుంటూ ఉండిపోతున్నారు. వీటితో పాటు పర్సనల్‌ కంప్యూటర్లు, గేమింగ్‌ కన్సోల్స్‌ ప్లాట్‌ఫామ్‌లలోని ఆన్‌లైన్‌ గేమ్స్​కు అడిక్ట్​ అయిపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న గేమింగ్​ కంపెనీలు పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇది వారిలో మానసిక సమస్యలకు, తల్లిదండ్రుల సొమ్మును దొంగచాటుగా ఆన్‌లైన్‌ ఆటలకు ఊడ్చేసే పరిస్థితికి దారితీస్తోందని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 10-19 ఏళ్ల వయసు పిల్లల్లో 1.3% మంది ఆన్‌లైన్‌ ఆటలకు బానిసలుగా మారగా, భారత్‌లో అలాంటి వారు 19.9 శాతం మంది ఉన్నట్లు ఇటీవల ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ క్రమంలోనే పిల్లలు ఆడుతున్న గేమ్స్​పై తల్లిదండ్రులు ఓ కన్ను వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లలు తమ ఆన్‌లైన్‌ కార్యకలాపాల గురించి గోప్యత పాటించడం, తమ వద్దకు పేరెంట్స్​ వచ్చిన వెంటనే స్క్రీన్‌లను మార్చడం, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం ఉండటం, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్లో కొత్త ఫోన్‌ నంబర్లు లేదా ఈ-మెయిల్‌లు విపరీతంగా పెరగడం లాంటివి జరిగినప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని చెబుతున్నారు.

పిల్లలతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఉండాలని, అలాంటప్పుడే ఏదైనా చిన్న తప్పిదం జరిగినా తల్లిదండ్రులతో వారు పంచుకుంటారని సైకాలజిస్ట్​ డాక్టర్​ గీత చల్లా అంటున్నారు. ఇలా ఫ్రీగా ఉండటం వల్ల ఆన్‌లైన్‌ గేమింగ్‌లో బ్లాక్‌మెయిల్‌ బారిన పడినా చెప్పుకోగలుగుతారని, లేదంటే పరిస్థితి ప్రమాదకరంగా మారే వరకు తెలియదని చెబుతున్నారు. అలాగే పిల్లలను కళలు, సాహిత్యం, భౌతిక క్రీడల్లాంటి వైపు మొగ్గుచూపేలా చేయాలని సూచిస్తున్నారు.

గేమింగ్‌ కన్సోల్స్‌పై నిఘా ఇలా : గేమింగ్‌ కన్సోల్స్‌లో పేరెంటల్‌ కంట్రోల్‌లను యాక్టివేట్‌ చేయడం ద్వారా పిల్లల ఆన్‌లైన్‌ గేమింగ్‌ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించే అవకాశముంది. ప్రముఖ గేమింగ్‌ కన్సోల్స్‌ అయిన ప్లే స్టేషన్, నిన్టెండో స్విచ్, ఎక్స్‌ బాక్స్‌లలో పేరెంటల్‌ కంట్రోల్‌లను యాక్టివేట్‌ చేయడంపై తల్లిదండ్రులకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తోంది.

ప్లే స్టేషన్‌:

  • ఈ ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌ ఖాతాలో అకౌంట్‌ మేనేజ్‌మెంట్‌కు సైన్‌-ఇన్‌ చేసి ఫ్యామిలీ మేనేజ్‌మెంట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • మొదటిసారి సభ్యుడి (పిల్లాడి)ని యాడ్​ చేస్తున్నట్లయితే ‘Set Up Now ఆప్షన్‌తో పాటు చైల్డ్‌ను యాడ్​ చేయాలి.
  • రెండోసారి మెంబర్​ను జోడించేందుకు ‘ఫ్యామిలీ మెంబర్‌ను జోడించు’ ఆప్షన్‌ను ఎంచుకొని చైల్డ్‌ను యాడ్​ చేయాలి.
  • పిల్లాడి పుట్టిన తేదీని ఎంటర్​ చేసి Next’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. అక్కడ కనిపించే చట్టపరమైన నిబంధనలను పరిశీలించి, అంగీకరించాలి.
  • పేరెంటల్‌ కంట్రోల్‌లను సెట్‌ చేయడానికి తెరపై కనిపించే సూచనలను ఫాలో అవ్వాలి.

నిన్టెండో స్విచ్‌:

  • ఫోన్‌లో నిన్టెండో స్విచ్‌ గేమింగ్‌ కన్సోల్‌కు సంబంధించిన పేరెంటల్‌ కంట్రోల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దాన్ని కన్సోల్‌కు లింక్‌ చేయాలి.
  • గేమ్‌లు, సంభాషణల కోసం సమయం, వయసు పరిమితులు, కంటెంట్‌ ఫిల్టర్‌ను సెట్‌ చేయాలి.

ఎక్స్‌ బాక్స్‌:

  • సెట్టింగ్స్‌లోకి అకౌంట్​ను సెలెక్ట్​ ఎంచుకున్న అనంతరం ఫ్యామిలీ సెట్టింగ్‌లను ఎంచుకోవాలి.
  • స్క్రీన్‌ సమయం, యాప్‌ యాక్సెస్, వయసు పరిమితులను సెట్‌ చేసుకోవాలి.
  • అడల్ట్‌ కంటెంట్‌ను సైతం బ్లాక్‌ చేయడానికి ఫిల్టర్‌లను ఎనేబుల్‌ చేయాలి.

ఆన్‌లైన్‌ గేమింగ్​ వ్యసనం నుంచి బయపడాలా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే

మీ ఫోన్​లో ఛార్జింగ్​ వెంటనే అయిపోతుందా?.. ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.