ఇంట్లోకి చొరబడి తండ్రి, కూతురిపై చిరుత దాడి - చిరుత దాడి ఇద్దరి పరిస్థితి విషమం
🎬 Watch Now: Feature Video
Leopard attack in up: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో చిరుత కలకలం రేపింది. కిషన్పుర్లోని ఠూఠీబారీలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి తండ్రి, కుమార్తెపై దాడి చేసింది. ఈ దాడిలో సుబాశ్(45) ఆమె కుమార్తె అంబిక(18) తీవ్రంగా గాయపడ్డారు. ఇరువురినీ గ్రామస్థులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ తండ్రీకూతుళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మాధవాలియా అటవీ ప్రాంతం నుంచి చిరుత గ్రామంలోకి ప్రవేశించింది. చిరుతను పట్టుకునేందుకు వచ్చిన అటవీ అధికారులపైనా దాడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.