Delay In Aramghar and Bahadurpura Flyover Opening : ఆరాంఘర్ - బహదూర్‌పురా ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయి నెల రోజులు పూర్తయింది. హైదరాబాద్‌లోనే అతి పెద్ద వంతెనల్లో ఇది రెండోది. రాకపోకలకు రెండు వైపులా మూడు వరుసల్లో భారీ వాహనాలు వెళ్లేలా రూ.7.36 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఇది ఈ నెల 3న ప్రారంభం కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.
చేవెళ్ల పార్లమెంటు పరిధి రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఆరాంఘర్ నుంచి హైదరాబాద్ పార్లమెంట్ పరిధి బహదూర్‌పురా వరకు బ్రిడ్జ్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తే తమ పరిధిలోనే ప్రారంభించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పట్టుపడుతున్నారు. తమ పరిధిలోనే వంతెన ప్రారంభం కావాలని ఎంపీ అసదుద్దీన్ అంటున్నారు. మజ్లీస్ పార్టీ నాయకులు ఈ నెల 9న అంతటా బ్యానర్లతో హోరెత్తించారు. ఇలా నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎంపీ మధ్య గొడవతో సీఎం ఫ్లై ఓవర్ ప్రారంభించకుండా దాటేస్తూ వస్తున్నారని సమాచారం.
నిత్యం అవస్థలు పెరిగిన రద్దీ, విమానాశ్రయానికి రాకపోకలతో నిత్యం ట్రాఫిక్ జామ్‌లతో మూడేళ్లుగా రాకపోకలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు శివారు, అటు నగర ప్రజలు వంతెన ప్రారంభం ఎప్పుడు అవుతదా అని ఎదురుచూస్తున్నారు. ఇద్దరు ప్రజాప్రతినిధుల పట్టుదలకు పోవటంతో ప్రారంభోత్సవం వాయిదా పడుతోంది.