New Year Celebrations In Hyderabad : హైదరాబాద్‌లో కొత్తసంవత్సర వేడుకల రూటే సపరేటు. కొత్త థీమ్‌లతో నిర్వాహకులు ఈవెంట్లను నిర్వహిస్తారు. సినీ తారలతో, గాయకులతో గ్లామర్‌ని తీసుకొస్తున్నారు. ఈ వేడుకల్లో సంగీతమే ప్రధానం కావడంతో డీజేలు కేంద్రంగానే పార్టీలను డిజైన్ చేశారు. పార్టీల్లో పాల్గొని ఎంజాయ్ చేసేందుకు కుర్రకారు సై అంటున్నారు. పేరున్న డీజేలను నగరానికి రప్పిస్తున్నారు. ఈవెంట్ల సంఖ్య కూడా గతం కంటే ఈసారి పెరిగింది.
31 రాత్రికి కౌంట్‌డౌన్ : కౌంట్‌డౌన్ మొదలైంది. ఏడాదిలో అందరూ కలిసి జరుపుకొనే వేడుక రానే వచ్చింది. 31 రాత్రికి కౌంట్‌డౌన్ మొదలైంది. 2024కి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికేందుకు పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు పార్టీ ఎక్కడ పుష్పా అంటూ వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య ఎవరి స్థాయిలో వారు వేడుకలు నిర్వహించుకునేందుకు గెస్ట్‌హౌస్‌లు, రిసార్టులు బుక్ చేసుకున్నారు. పార్కులు, క్లబ్‌లు, పబ్‌లు, స్టార్ హోటల్స్, శివార్లలోని కన్వెన్షన్ హాళ్లు వేడుకలకు సిద్ధమయ్యాయి. గేటెడ్ కమ్యూనిటీల్లోనూ భారీ ఎత్తున వేడుకలతో సందడి చేసేందుకు అసోసియేషన్లు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
రామోజీ ఫిల్మ్‌సిటీలో : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్‌సిటీలో 31న రాత్రి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశంలోనే నంబర్‌వన్ డీజే చేతస్ లైవ్ మ్యూజిక్ షో ఉంటుంది. దాంతో పాటు స్టాండప్ కామెడీ, అక్రోబాటిక్ స్టంట్స్, గేమ్స్ ఉన్నాయి. వేడుకలు ముగిసిన తర్వాత ఎల్బీనగర్ వరకు రవాణా సౌకర్యం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
జూబ్లిహిల్స్‌లోని ఓ సెంటర్‌లో ఏర్పాట్లు : నయాసాల్ పార్టీలను నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త థీమ్‌లతో నిర్వహిస్తుంటారు. విద్యుత్తు ధగధగల నడుమ, లైవ్ మ్యూజిక్, డీజేల సంగీత హోరులో వేడుకల నిర్వహణ మొదలు ఇండోర్‌లో పార్టీల వరకు వేర్వేరు థీమ్‌లతో ముందుకొస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, ఈడీఎం, రాక్ మ్యూజిక్‌తో అలరించేలా ఏర్పాట్లు చేశారు. డ్యాన్స్ ఫ్లోర్లు, ఓపెన్ ఎరీనాలో వేడుకలకు కుర్రకారు ఉత్సాహం చూపిస్తున్నారు. లైవ్ మ్యూజిక్‌కు అనుగుణంగా నృత్యాలతో హోరెత్తించనున్నారు. న్యూయర్ వేడుకలకు మంచి స్పందన వస్తుందని నోవాటెల్‌లో న్యూఈయర్ ఈవెంట్ నిర్వహిస్తున్న ఆల్వేస్ ఈవెంట్స్ యజమాని సంపత్ ‘ఈనాడు’తో అన్నారు.
'న్యూ ఇయర్ వేడుకకు' రా.. రమ్మంటున్న రామోజీ ఫిల్మ్‌సిటీ - ముందుగా బుక్ చేసుకుంటే ఆ ఆఫర్ మీ సొంతం
న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైన భాగ్యనగరం - మత్తు బాబులూ జర భద్రం