Suzuki Access 125: మారుతి సుజుకి ఇండియాకు చెందిన 'యాక్సెస్ 125' స్కూటర్ అరుదైన ఘనత సాధించింది. ఈ మోడల్ అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతూ కంపెనీ సేల్స్ పెరగడంలో కీలక పాత్రను పోషించింది. కంపెనీ తన ప్లాంట్లలో ఈ మోడల్‌ను ఏకంగా 60 లక్షల యూనిట్ల ప్రొడక్షన్‌ను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో కంపెనీ చరిత్రలోనే హై డిమాండ్ ఉన్న స్కూటర్‌గా 'సుజుకి యాక్సెస్ 125' నిలిచింది. ఈ స్కూటర్ సాధించిన ఘనతపై సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ ఆనందం వ్యక్తం చేశారు.
"సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ 6మిలియన్ల ప్రొడక్షన్ అనేది కంపెనీకి ఓ సిగ్నిఫికెంట్ మూమెంట్. ఇది దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో యాక్సెస్ 125పై మా కస్టమర్‌లు చూపిన విశ్వాసాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. టూ-వీలర్ రంగంలో ఈ యాక్సెస్ 125 మంచి ప్రజాదరణతో దూసుకుపోవటంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా కస్టమర్లకు రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరిచే ఉత్తత్తులను అందించేందుకు మేం ఎదురుచూస్తున్నాం." - కెనిచి ఉమెడ, సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్
'సుజుకి యాక్సెస్ 125' పవర్‌ట్రెయిన్: ఈ స్కూటర్ 2006లో ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. 125cc సెగ్మెంట్లో కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. ఈ స్కూటర్‌లో 124cc, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 8.6 bhp పవర్, 10 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఫీచర్లు: దీని ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్కూటర్ సుజుకి ఎకో పెర్ఫార్మెన్స్ (SEP) టెక్నాలజీ, అధునాతన ఫ్యూయల్ ఇంజెక్షన్, ఎకో అసిస్ట్ ఇల్యూమినేటర్‌తో వస్తుంది. వీటితో పాటు ఇది 22.3 లీటర్ల లార్జ్ అండర్-సీట్ స్టోరేజ్, సుజుకి ఈజీ స్టార్ట్ సిస్టమ్, లాంగ్ సీట్, వైడ్ ఫ్లోర్‌బోర్డ్ వంటి ఫీచర్లతో మంచి పెర్ఫార్మెన్స్, కంఫర్ట్‌ను అందిస్తుంది.
'సుజుకి యాక్సెస్ 125' అనేది హై గ్రౌండ్ క్లియరెన్స్‌తో కూడిన లైట్‌వెయిట్ స్కూటర్. ఇది సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇందులో ఫ్రంట్ స్టీల్ ఫెండర్, వన్-పుష్ సెంట్రల్ లాకింగ్, బ్రేకింగ్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. అందుకే గత 18 ఏళ్లగా ఇది టూ-వీలర్ రైడర్లకు ఫేవరెట్ ఛాయిస్‌గా మారింది.
ఆకాశంలో అద్భుతం.. మీరు ఎప్పుడైనా 'బ్లాక్ మూన్' చూశారా?- ఇప్పుడు మిస్సైతే మళ్లీ ఎప్పటికో..!
లావా vs మోటో- ఈ రూ.10వేల లోపు 5G ఫోన్లలో బెస్ట్ ఏది?- ఎందులో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి?
సూర్యుని చెంతకు మానవ అస్త్రం- చరిత్ర సృష్టించిన 'పార్కర్ సోలార్ ప్రోబ్'
అబ్బబ్బా ఏమి డిమాండ్ రా సామీ!- 11 నెలల్లో లక్షమంది కొన్న కారు ఇదే!