Video: కన్నుల పండువగా జగన్నాథ రథయాత్ర - పూరీ జగన్నాథ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15707573-thumbnail-3x2-rath.jpg)
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తుల మధ్య ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కరోనా కారణంగా గత రెండేళ్లు ఆంక్షల మధ్యే రథయాత్రను నిర్వహించారు. కానీ ఈసారి భక్తలను అనుమతించగా.. భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు విదేశీయులు కూడా పూరీ చేరుకున్నారు. నందిఘోష్ రథంలో జగన్నాథుడు, తాళధ్వజలో బలభద్రుడు, దర్పదళన్లో సుభద్రను ఊరేగిస్తారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.