ఆస్పత్రికి పవర్​ కట్.. సెల్​ఫోన్​ ​లైట్​ వెలుగులోనే ప్రసవం.. లక్కీగా... - hospital power cut

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 21, 2022, 3:44 PM IST

Odisha Power Outage: సరిగ్గా ప్రసవం సమయానికి ఆస్పత్రిలో కరెంటు పోగా.. సెల్​ఫోన్ టార్చ్​లైట్​ వెలుగులోనే బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. ఈ ఘటన ఒడిశా గంజాం జిల్లా పొలాసరాలో బుధవారం రాత్రి జరిగింది. అరకొర వెలుతురులోనే ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఈ ప్రసవం జరిగేలా చూశారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గంజాం జిల్లా ప్రధాన ఆరోగ్య అధికారి ఉమాశంకర్ మిశ్రా స్పష్టం చేశారు. కరెంట్​ పోయినా ఇబ్బంది లేకుండా ఆస్పత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.