అందాలతో ఆకట్టుకున్న అమ్మాయిలు.. హంస నడకలతో మతిపోగొట్టిన ముద్దుగుమ్మలు.. - fashion show in marygold hotel in hyderabad
🎬 Watch Now: Feature Video

Fashion Show: మెరుపు తీగలాంటి అమ్మాయిలు.. కంచుపట్టు చీరలు, గాగ్రా, లంగా ఓణి వస్త్రాలను ధరించి ర్యాంప్‌పై తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. అవార్డు, రివార్డు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా మే 7వ తేదీ హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు వైశ్య లిమెలైట్ అవార్డులు అందించనున్నారు. బేగంపేటలోని మ్యారిగోల్డ్ హోటల్‌లో వైశ్య లిమెలైట్ అవార్డుకు సంబంధించిన కప్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైశ్య లిమెలైట్ అవార్డు వ్యవస్థాపకులు శివకుమార్, సినీ వర్ధమాన కథానాయిక నికిత తన్వీర్‌తో పాటు పలువురు మోడల్స్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ఆద్యంతం ఆకట్టుకుంది. పలువురు సుందరాంగులు విభిన్న రకాలైన వస్త్రాలను ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో అలరించారు.