ఏనుగుల బీభత్సం.. కార్లపై దాడి.. వాటి కోసమే! - ఏనుగుల బీభత్సం
🎬 Watch Now: Feature Video
elephants attack cars: కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగుపిల్లతో సహా రోడ్డుపైకి వచ్చిన రెండు గజరాజులు కార్లపై దాడి చేశాయి. ఈ ఘటనలో పోలీసు కారు తప్పించుకోగా మరో కారు ధ్వంసం అయ్యింది. చామరాజనగర్ సమీపంలోని అసనుర్ గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఏనుగుల రోడ్డు పైకి రావడం వల్ల అర గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఏనుగులను అడవుల్లోకి తోలి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. చెరకు తినడానికి అలవాటు పడ్డ ఏనుగులు.. వాటి కోసం ట్రక్కులను ఆపుతూ ఇలా చేస్తున్నాయని అధికారులు తెలిపారు.