వేగంగా వస్తున్న కారు ఢీకొని విశ్రాంత సైనికుడు మృతి - బెంగళూరు రిటైర్డ్ సోల్జర్​ మృతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 12, 2022, 8:27 PM IST

తాగిన మత్తులో ఓ వ్యక్తి అతివేగంగా కారు నడిపి ఒకరి ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడు. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులోని హెబ్బల్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఫుట్​పాత్ పైన బైక్​తో ఉన్న వారిపైకి ఒక్కసారిగా కారు దూసుకురాగా ఓ విశ్రాంత సైనికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. సీసీటీవీలో ఆ దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మృతి చెందిన రిటైర్డ్​ సోల్జర్​ ప్రస్తుతం ఓ ప్రైవేట్​ కంపెనీలో సెక్యురిటీగా విధులు నిర్వహిస్తున్నాడు. గాయపడిన వారు కూడా మృతిడితో కలిసి పనిచేసేవారని హెబ్బర్ పోలీసులు తెలిపారు. కారు నడిపిన వ్యక్తికి గాయాలు కావడం వల్ల అతన్నీ ఆస్పత్రికు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.