మృతదేహంతో 10 కి.మీ. కాలినడకన ప్రయాణం.. మంచంపై మోసుకెళ్తూ! - మంచం మీద మృతదేహం
🎬 Watch Now: Feature Video
Deadbody On Cot: మహిళ మృతదేహాన్ని మంచం మీద మోసుకెళ్లిన హృదయవిదారక ఘటన ఛత్తీస్గఢ్లో వెలుగుచూసింది. దంతెవాడ జిల్లాకు చెందిన జోగి పోడియం అనే మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు డబ్బులు లేక మంచం మీద మోసుకుంటూ కాలినడకన బయలుదేరారు కుటుంబసభ్యులు. పది కిలోమీటర్లు నడిచాక మధ్య దారిలో స్థానిక పోలీసులు వారిని గమనించి విషయాన్ని ఆరా తీశారు. వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేసి.. అంత్యక్రియలకు కొంత నగదును కూడా ఇచ్చారు.