Live Video: వ్యాన్‌ను ఢీకొట్టిన బస్సు.. లక్కీగా ఆ ఇద్దరు... - బస్సు ప్రమాదం
🎬 Watch Now: Feature Video
తమిళనాడు దిండిగల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అత్తూరు సమీపంలో ఓ బస్సు.. ఓమ్నీ వ్యాన్‌ను ఢీకొట్టింది. అత్తూరుకు చెందిన అన్నామలై కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వ్యానులో వెళ్లారు. దిండిగల్ సమీపంలోకి రాగానే సరైన సిగ్నల్ ఇవ్వకుండా అకస్మాత్తుగా మలుపు తిప్పాడు. బస్సును నియంత్రించేందుకు డ్రైవర్ ప్రయత్నించినా సాధ్యపడలేదు. వ్యాన్, బస్సు ఢీకొని.. పక్కనే ఉన్న ఓ చిన్న షెడ్డువైపు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో వ్యాన్‌తోపాటు ఆ షెడ్డు, రోడ్డు పక్కన నిలిపిన కొన్ని ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు బస్సులోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి.
Last Updated : Jun 6, 2022, 9:24 PM IST