ఎన్టీఆర్ దైవాంశ సంభూతుడు, ఇవే సాక్ష్యాలు - నిర్మాత అశ్వినీ దత్ ఆలీతో సరదాగా
🎬 Watch Now: Feature Video

ఇష్టదైవాలు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. శతాబ్దాల శిల్పాలో, రాజా రవివర్మ గీసిన చిత్రాల్లోనో దేవుళ్లు ఇలా ఉంటారని పోల్చుకుంటాం. కానీ అశేష ప్రేక్షకలోకం శ్రీకృష్ణుణ్ణి, శ్రీరాముణ్ణి ఎన్టీ రామారావులోనే చూసుకుందనేది నూరుశాతం నిజం. అనేక పౌరాణిక పాత్రల్లో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన రామారావు, అచ్చం ఆ పాత్రలకోసమే పుట్టి వుంటారని చాలా మంది అంటారు. అయితే సీనియర్ ఎన్టీఆర్తో 'ఎదురు లేని మనిషి', 'యుగపురుషుడు' వంటి హిట్ సినిమాలు చేసిన నిర్మాత అశ్వనీదత్.. 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ' చిత్రీకరణ సమయంలో నటసార్వభౌముడితో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు. అదేంటంటే..
Last Updated : Aug 17, 2022, 6:36 AM IST