రణ్‌బీర్- ఆలియా పెళ్లికి రాయల్ గిఫ్ట్ - 125 బంగారు పూలతో..
🎬 Watch Now: Feature Video
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్- ఆలియాభట్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ జంట పెళ్లి కోసం.. అటు అభిమానులతోపాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పెళ్లి నేపథ్యంలో అభిమానులు తమ స్టార్స్ కోసం.. ప్రత్యేకమైన గిఫ్ట్స్ పంపుతున్నారు. తాజాగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇద్దరు అభిమానులు.. ఆలియా- రణ్‌బీర్ కోసం ఒక రాయల్ గిఫ్ట్‌ను పంపారు. 24 క్యారెట్ల బంగారు పూత పోసిన 125 గులాబీ పూలు పొదిగిన ఒక పుష్పగుచ్ఛాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆ ఇద్దరు అభిమానులూ బంగారం వ్యాపారులే. అయితే దాదాపు ఐదు అడుగులు ఉన్న ఈ రాయల్ గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Last Updated : Apr 13, 2022, 11:01 PM IST