కుక్కను మింగేసిన 13 అడుగుల పైథాన్​.. ఏనుగు హల్​చల్​..! - కర్ణాటక చామనగర్​లో పాఠశాలలోకి ప్రవేశించిన ఏనుగు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 28, 2022, 12:35 PM IST

రాజస్థాన్​ కోటాలో 13 అడుగుల పైథాన్ హల్​చల్ చేసింది. థర్మల్ కాంప్లెక్స్ సమీపంలో ఓ కుక్కను మింగేసింది. అనంతరం పాము అడవిలోకి వెళ్లిపోయింది. మరోవైపు, కర్ణాటక చామరాజనగర్​లోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలోకి ఓ ఏనుగు ప్రవేశించి బీభత్సం సృష్టించింది. అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును బెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం గజరాజు అడవిలోకి పారిపోయింది. ఉత్తరాఖండ్​ అల్మోరాలోని గగాస్ నది వంతెనపై ఓ పులి గట్టిగా అరుస్తూ సంచరించింది. ఆ వంతెన పైనుంచి వెళ్తున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను ఫోన్​లో బంధించాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.