పాత పింఛన్ కోసం అసెంబ్లీ ముట్టడి.. ఉద్యోగులపై జలఫిరంగులు - పాత ఫించన్ పథకం
🎬 Watch Now: Feature Video
Employees Protested: కొత్త పింఛన్ పథకం స్థానంలో పాత పింఛన్‌ను అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలోని అసెంబ్లీ ముందు వెయ్యి మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు గురువారం ఆందోళన చేపట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. అయితే, బారికేడ్లు, జలఫిరంగులను దాటుకుని శాసనసభ ముట్టడి చేపట్టారు ఉద్యోగులు. ఈ క్రమంలో ఉద్యోగులు, పోలీసుల మధ్య స్వల్ప ఘర్షణ తలెత్తింది. మరోవైపు.. విపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తారు. శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. సీఎం జైరామ్ రమేశ్ ప్రకటన చేసే వరకు నిరసనలు ఆగవని ఉద్యోగులు తేల్చి చెప్పారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తమ ఆందోళనను విరమించారు ఉద్యోగులు. భవిష్యత్తు కార్యాచరణపై కోర్ కమిటీ భేటీలో నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST