mutyapu pandiri seva: ముత్యపు పందిరిలో.. మూడు నామాలవాడు - Srivari Annual Brahmotsavam in glory in Thirumala
🎬 Watch Now: Feature Video

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి కాళీయమర్దన చిన్నికృష్ణుడిగా కొలువుదీరారు. నవరత్నాల్లో ముత్యం ఒకటి. ఇది చంద్రునికి ప్రతీక. చంద్రుడు చల్లనివాడు. ఆరోగ్యప్రదాత స్వామివారికి ప్రీతిపాత్రమైన ముత్యాలహారాలు, రత్నాల వల్ల కలిగే వేడిమినీ, పుష్పాల వల్ల కలిగే సుగంధాన్ని తమలో ఇముడ్చుకుని, స్వామివారి వక్షస్థలానికి, అక్కడి లక్ష్మీదేవికి సమశీతోష్టస్థితిని చేకూరుస్తూ, తాపగుణాన్ని హరిస్తూ, ఉత్సాహాన్ని, ప్రశాంతతను చేకూరుస్తున్నాయి. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, పలువురు పాలకమండలి సభ్యులు వాహన సేవలో పాల్గొన్నారు. కొవిడ్ నేపథ్యంలో వాహన సేవలను ఆలయంలోని కల్యాణ మండపంలో ఏకాంతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.