రాశిఫలం: సింహ - సింహరాశి ఫలితాలు
🎬 Watch Now: Feature Video
ఆదాయం: 14, వ్యయం: 2, రాజపూజ్యం: 1, అవమానం: 7
సింహరాశి వారు... ఈ ఏడాది విదేశియాన ఖర్చులు ఎక్కువ చేస్తారు. మీరు చేస్తుంది మంచికో చెడుకో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం, కుటుంబ సభ్యుల కోరిక కాదనలేక ..ఎప్పటికప్పుడూ కార్యక్రమాలు చేయడం.. వాటికి అవసరమైన డబ్బులు సర్దుబాటు అవుతాయి. సామాజికంగా, రాజకీయంగా వచ్చే మార్పులు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో మీ మీద ప్రభావం చూపిస్తాయి. గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. మాట పట్టింపు, మెుండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు. రావాల్సిన ఆస్తులు ఎట్టకేలకు సానుకూలపడతాయి. రూపాయి ఖర్చు అయ్యే చోట వంద రూపాయలు ఖర్చు అవుతాయి. అయినా మీకేం ఇబ్బంది రాదు. క్రీడలు, రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి. అయితే జూదలు, పందేలకు దూరంగా ఉండటం మంచిది. సామాజిక పరిస్థితుల మీద విరక్తి పుడుతుంది. సంతాన సంబంధ విషయాల్లో పురోగతి బాగుంది. వివాహశుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. టెండర్ల విషయంలో అయోమయం నెలకొన్ని మీకు అనుకూలంగా మారతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ ఏడాది అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
Last Updated : Mar 27, 2020, 10:58 AM IST