ప్రతిధ్వని: భారత వ్యూహాలకు చైనా చిక్కుకుంటుందా?
🎬 Watch Now: Feature Video
భారత్, అమెరికా మధ్య కుదిరిన బెకా ఒప్పందం చైనాను తీవ్రంగా కలవర పెడుతోంది. సార్వభౌమత్వం, స్వేచ్ఛను కాపాడుకునేందుకు భారత్కు నిరంతరం అండగా ఉంటామని అమెరికా ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ అత్యంత వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. అటు అమెరికా సైతం చైనాను కట్టడి చేసేందుకు మన దేశంతోపాటుగా బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులను కలుపుకుని వెళ్లాలని ప్రయత్నం చేస్తోంది. ఇంకో వైపు క్వాడ్ కూటమి చైనాపై కత్తి జూలిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత వ్యూహాలకు చైనా చక్ర బృందంలో చిక్కుకుంటుందా? అమెరికా అండతో చైనా దుశ్చర్యలను భారత్ ఏ విధంగా నిలవరించబోతుంది? లాంటి అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చ.