Lower Manair Dam: దిగువ మానేరుకు జలకళ.. ఆకట్టుకుంటోన్న డ్రోన్ దృశ్యాలు
🎬 Watch Now: Feature Video
కరీంనగర్ శివారులోని దిగువ మానేరు జలకళ సంతరించుకుంది. మోయ తుమ్మెద వాగుతో పాటు మధ్యమానేరు ప్రాజెక్టు నుంచి భారీగా నీరు వచ్చి చేరడంతో నిండుకుండను తలపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జులై చివరి వారంలోనే పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తి నీటిని మానేరు వాగులోకి వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు నుంచి భారీస్థాయిలో నీటిని కిందికి వదులుతుండటంతో ఆ దృశ్యాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. నీటి విడుదలకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలను నీటి పారుదలశాఖ అధికారులు విడుదల చేశారు. భారీగా గేట్ల నుంచి కిందికి దూకుతున్న వరదనీటితో పాటు మానేరు వాగులో గంగమ్మ పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ దృశ్యాలను చూసేందుకు నగర ప్రజలు పోటీ పడుతున్నారు.
Last Updated : Jul 24, 2021, 6:14 AM IST