రాశిఫలం: కన్య - ఉగాధి రాశి ఫలాలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6530576-801-6530576-1585057025125.jpg)
ఆదాయం: 2 , వ్యయం: 11, రాజపూజ్యం: 4, అవమానం: 7
ఈ రాశివారికి ఈ ఏడాది ఆర్థికాభివృద్ధి బాగుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతంలో కంటే ఆస్తుల విలువ పెరుగుతుంది. దూరదృష్టితో మీరు కొన్న స్థిరాస్తులు మంచి ఫలితాలనిస్తాయి. సంసార పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. వాహన యోగం, గృహ యోగం అనుకూల పడతాయి. శుభకార్యలకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. స్నేహితులు, బంధువులతో ఉన్న ఏర్పడ్డ విభేధాలు సమాసిపోతాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. ఈ ఏడాది తలపెట్టిన కార్యక్రమాలు మూడొంతుల పూర్తవుతాయి. వ్యవసాయరంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులను అదుపుచేయడంలో విఫలమవుతారు. ఆదాయ మార్గాలు పెంచుకోవడం శ్రేయస్కరం అని భావిస్తారు. అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. మార్పు రాని వ్యక్తుల్లో మార్పు కోసం ఎలాంటి ప్రయత్నం చేయకూడదని నిర్ణయించుకుంటారు. అంతర్గత రాజకీయాల కారణంగా ఒకరికి తెలియకుండా మరొకరికి ఆర్థిక సాయం చేయాల్సి పరిస్థతి వస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు కొన్ని లభిస్తాయి.. కొన్ని వాయిదా పడతాయి. చాలా అంశాలను మీకు అనుకూలంగా మార్చుకోగలరు. రాని బాకీలు వివాదస్పదం కాకుండా వసూలు చేసుకోగలుగుతారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. కులాంతర వివాహాలు, ప్రేమవివాహల గురించి మీ వ్యాఖ్యానాలు విమర్శలకు దారి తీస్తాయి.
Last Updated : Mar 25, 2020, 10:30 AM IST