ప్రతిధ్వని: బిహార్ ఎన్నికల పొత్తులు-రాజకీయ ఎత్తుగడలు - బిహార్ ఎన్నికల పొత్తులపై ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8822074-thumbnail-3x2-prathidwani.jpg)
ఉత్తరాదిన కీలక రాష్ట్రమైన బిహార్ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటం వల్ల ఎన్నికల పొత్తులు-రాజకీయ ఎత్తుగడలకు తెరలేచింది. అధికార్ ఎన్డీఏ, ప్రతిపక్ష ఆర్జేడీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఒకనాడు బీమార్ రాష్ట్రంగా అపఖ్యాతిని మూటగట్టుకున్న బిహార్‌ను... తాను ప్రగతి బాట పట్టించానని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ప్రచారంలో చాటుకుంటున్నారు. మరోవైపు తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జీడీ... ప్రత్యర్థులకు గట్టి సవాల్‌ను విసురుతోంది. కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. యశ్వంత్ సిన్హా సైతం... 16 చిన్న పార్టీలను కలిసి ఐక్య ప్రజాస్వామ్య కూటమిని ఏర్పాటు చేశారు. వామపక్షాలు కూడా మేమేమీ తక్కువ కాదంటున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్ ఎన్నికల సమరం-పార్టీల పొత్తులపై ప్రతిధ్వని ఆన్లైన్లో చర్చను చేపట్టింది.