Clay Ganesh: చిన్నారుల చేతుల్లో ముస్తాబైన చిట్టిపొట్టి మట్టి గణేశులు.. - clay ganesh work shop
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్ గాజులరామారాం సర్కిల్ 26 సిబ్బంది ఆధ్వర్యంలో చిత్తారమ్మ ఆలయంలో మట్టి గణపతి విగ్రహాల తయారీ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు, చిన్నారులు పాల్గొని బుజ్జిబుజ్జి గణపతులను తయారు చేశారు. వాటిని అలంకరించి అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గాజులరామారాం డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి... వినాయక నవరాత్రులను పర్యావరణహితంగా జరుపుకోవాలని సూచించారు. ప్రకృతితో సహజీవనం చేస్తూ... ముందుకు సాగిపోతే మానవ మనుగడకు సార్ధకత ఉంటుందని.. అందుకే మట్టి గణపతులను పూజించాలని సూచించారు.