Farmer : రైతుకెంత కష్టమొచ్చె.. బండికి అరక కట్టె... - kamareddy farmer troubles
🎬 Watch Now: Feature Video

రైతు(Farmer) పంటను పండించడానికి ఆరుగాలం ఎంత కష్టపడతాడో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బస్వాపూర్‌లో మారుతి అనే రైతు.. తన రెండెకరాల్లో పత్తి పంట సాగు చేశారు. పత్తిలో కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగాయి. కలుపు తీయించడానికి కూలీలు దొరకక, సొంత ఎద్దులు లేకపోవడం వల్ల ద్విచక్రవాహనానికి అరక కట్టి కలుపు మొక్కలు తొలగించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలను చూసిన పలువురు రైతన్నకు ఎంత కష్టమచ్చిందోనని సానూభూతి వ్యక్తం చేశారు.