తలైవాను అలా చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ - రజనీకాంత్ కొత్త అప్డేట్స్
🎬 Watch Now: Feature Video

Superstar Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజనీ కూడా అప్పుడప్పుడు అభిమానులను కలుస్తూ ఉంటారు. కానీ కొంతకాలంగా తలైవా.. షూటింగ్ కోసం మినహా ఆయన ఇంటి నుంచి బయటకురావట్లేదు. దీంతో ఆయనను చూసే అవకాశం అభిమానులకు దక్కట్లేదు. అయితే సోమవారం.. చాలా కాలం తర్వాత బయట కనిపించారు. ఓ హోటల్ ప్రారంభ కార్యక్రమానికి సతీమణి లతా, కుమార్తె సౌందర్యతో హాజరయ్యారు. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత తలైవా కనిపించేసరికి అభిమానులు సంబరపడిపోతున్నారు.