సినిమా చూసి నిక్ ఏడ్చేశాడు: ప్రియాంక
🎬 Watch Now: Feature Video
ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్ భార్యాభర్తలుగా నటించిన చిత్రం 'ద స్కై ఈజ్ పింక్'. ఆర్‌ఎస్‌వీపీ మూవీస్ - రాయ్ కపూర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సోనాలీ బోస్ దర్శకత్వం వహించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జైపూర్ వెళ్లింది. పలు అంశాలను ఈటీవీ భారత్ ప్రేక్షకులతో పంచుకుంది.
సినిమాలో అదితి చౌదరి పాత్ర పోషించింది ప్రియాంక. ఈ పాత్ర తన మనసుకు దగ్గరైన పాత్రని తెలిపింది. ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేసింది. 2004 నుంచి ఫర్హాన్‌తో మంచి స్నేహం ఉండటం వల్లే ఇలాంటి రోల్ చేయడానికి ఇబ్బంది పడలేదని చెప్పుకొచ్చింది ప్రియాంక.
"నికో జోనస్ ఈ సినిమాని చూశాడా అని ప్రశ్నించగా.. తాను ప్రీమియర్ చూడలేదు. కానీ రెండు నెలల క్రితమే సినిమా చూశాను. తనకు ఈ చిత్రం నచ్చింది. సినిమా చూస్తూ ఏడ్చేశాడు." అని తెలిపింది ప్రియాంక. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శించినప్పుడు చిత్రబృందాన్ని వేలమంది అభినందించారని.. ఎందరో మన్ననలు అందుకుందని వెల్లడించిందీ గ్లోబల్నటి.
Last Updated : Oct 2, 2019, 5:55 PM IST