పద్మ అవార్డుల్లో మెరిసిన తారలు - sharath kamal
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/320-214-2661076-325-173956e1-42b2-4961-865d-3c9f4406b3ee.jpg)
పద్మ అవార్డుల్లో తారలు సందడి చేశారు. పలువురు సినీతారలు, క్రీడాకారులు రాష్ట్రపతి నుంచి పద్మ అవార్డులను అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. క్రీడాకారుల్లో క్రికెటర్ గౌతం గంభీర్, భారత కబడ్డీ జట్టు కెప్టెన్ అజయ్ ఠాకూర్, రెజ్లర్ భజరంగీ పూనియా, టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్, చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.
సినీ తారలు మోహన్ లాల్ పద్మ భూషన్ అందుకోగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రభుదేవా, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్, శివమణి, మనోజ్ బాజ్ పేయ్, పాటు పలువురు పద్మశ్రీ స్వీకరించారు.