'మహర్షి' సినిమా నిడివి మరింత పెరుగుతుందా? - allari naresh
🎬 Watch Now: Feature Video
'మహర్షి' సినిమాలో అల్లరి నరేశ్ పాత్ర చాలా కీలకమని అన్నాడు దర్శకుడు వంశీపైడిపల్లి. మహేశ్, నరేశ్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుట్ అయిందని తెలిపాడు. పంటపొలాల్లో వచ్చే సన్నివేశాలు మధుర జ్ఞాపకాలని హీరో మహేశ్ తన అనుభవాలను పంచుకున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ సినిమా చూసి "నీ అన్ని చిత్రాల రికార్డులను వారం రోజుల్లో తిరగరాస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారని వివరించాడు. పెళ్లి చూపుల సన్నివేశం నా ఫేవరేట్ అని మరో వారం తర్వాత ఆ సన్నివేశాన్ని పొడగించాలని అనుకుంటున్నామని అన్నాడు మహేశ్.