'మహర్షి తర్వాత మహేశ్ బాబు వేరు..' - tollywood
🎬 Watch Now: Feature Video
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి కలయికలో విడుదలైన 'మహర్షి' అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. వారాంతపు వ్యవసాయం కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. చిత్ర కథానాయకుడు మహేశ్ బాబుతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన రేపటితరం మహర్షుల ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఉత్సాహపర్చారు. మహేశ్‌ను విద్యార్థులు ప్రశ్నలతో ముంచెత్తారు.