Hero movie: 'ఈ విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను' - hero movie success meet
🎬 Watch Now: Feature Video
మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఓ కుర్రాడు సినిమా హీరో అవ్వాలన్న తన కలను ఎలా సాకారం చేసుకున్నాడనే కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం హీరో. సూపర్‌స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని చోట్ల తొలిరోజే ప్రేక్షకులు హీరోకు మంచి మార్కులే వేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో చిత్ర బృందం బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకుంది. ఈ సంక్రాంతికి ప్రేక్షకులు ఇచ్చిన విజయాన్ని ఎప్పటికి మరిచిపోలేనని అశోక్ ఆనందం వ్యక్తం చేయగా.... పండగకి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ప్రయత్నం సఫలమైందని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెలిపారు. తమ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.