Gautham menon interview: బతుకమ్మ పాటను రూపొందించాలని గౌతమ్​ మీనన్​కు ఆలోచన ఎలా వచ్చిందంటే..! - బతుకమ్మ పాట రూపొందించిన గౌతమ్​మీనన్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 5, 2021, 4:49 PM IST

Updated : Oct 5, 2021, 7:12 PM IST

ఈ ఏడాది మన బతుకమ్మ(saddula Bathukamma Song 2021) పాటకు అంతర్జాతీయ గుర్తింపు రానుంది. ప్రతి సంవత్సరం మాదిరి ఈ ఏడు కూడా చాలామంది బతుకమ్మ పాటలు రూపొందించారు. అందులో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూసేది మాత్రం ఒక పాట కోసం. ఎందుకు ఆ పాటకు అంత ప్రాముఖ్యత ఎందుకంటే.. ఆ గీతాన్ని రూపొందించింది సాధారణ వ్యక్తులు కాదు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఈ ఇద్దరి​ కలిసి ఈయేడు ఓ బతుకమ్మ పాటను రూపొందించారు. ఈ పాటను ప్రముఖ గాయని పాడారు. ఇటీవల హైదరాబాద్‌ సమీపంలోని భూదాన్‌ పోచంపల్లిలో దృశ్యచిత్రీకరణ జరిపారు. రాష్ట్రంలో ఈనెల 6 నుంచి బతుకమ్మ పండుగ(saddula Bathukamma Song 2021) ప్రారంభం కానుంది. ఆ లోపే పాటను విడుదల చేస్తారు. ఈ గీతాన్ని ఇతర భాషల్లోకి సైతం అనువదించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రేమ చిత్రాలకు ప్రాణం పోయడంలో సిద్ధహస్తుడైన గౌతమ్​మీనన్​... రూపొందించిన బతుకమ్మ పాట ఎలా ఉండబోతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు బతుకమ్మ పాటను రూపొందించడానికి ఆయనకు ప్రేరణ ఎలా వచ్చింది. పాట చిత్రీకరణ ఎలా జరిగింది.. మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే..
Last Updated : Oct 5, 2021, 7:12 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.