హే ప్రభూ హే క్యా హువా - గుర్రంపై వెళ్లి ఫుడ్ డెలివరీ - వీడియో వైరల్ - zomato boy Horse delivery
🎬 Watch Now: Feature Video
Published : Jan 3, 2024, 11:02 AM IST
Zomato Boy Horse Ride Hyderabad : ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే నిమిషాల్లో వారి వద్దకు చేర్చాల్సిందే. ట్రాఫిక్ కష్టాలను దాటుకుని చెప్పిన సమయానికి ఆహారం అందించేందుకు డెలివరీ బాయ్స్ పడే కష్టాలు అన్నీ ఇన్నీ ఉండవు. మధ్యలో పెట్రోల్ అయిపోయినా ఏ కారణంతో అయినా బండి ఆగిపోయినా కొన్ని సార్లు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ తరుణంలో మంగళవారం రోజున దేశవ్యాప్తంగా నెలకొన్న పెట్రోల్ కొరత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేయగా డెలీవరీ బాయ్స్ కష్టాలైతే చెప్పుకోలేని విధంగా మారిపోయాయి.
Zomato Boy Horse Ride Viral Video : ఈ నేపథ్యంలోనే ఓ ఫుడ్ డెలివరీ బాయ్ తన బైకులో పెట్రోల్ అయిపోతే బంకుల వద్ద గంటల సేపు వేచి చూడకుండా ఓ ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతికాడు. అతడు గుర్రం మీద తిరుగుతూ ఫుడ్ డెలివరీ చేయడం హైదరాబాద్లో చూపరులను ఆకట్టుకుంది. మంగళవారం పెట్రోల్ కోసం బంక్ వద్ద లైన్‌లో నిలబడిన ఓ జొమాటో డెలివరీ బాయ్ ఇంధనం దొరకకపోవడంతో విసుగుచెంది వాహనాన్ని పక్కనపెట్టాడు. అనంతరం గుర్రంపై వెళ్లి ఆహారాన్ని అందించాడు. ఇది హైదరాబాద్ చంచల్‌గూడ పరిసర ప్రాంతాల్లో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.