రూ.1000కోట్లతో అతిపెద్ద ధ్యానకేంద్రం- పోటెత్తిన పర్యటకులు- ఈటీవీ భారత్ స్పెషల్ కవరేజ్! - ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన
🎬 Watch Now: Feature Video
Published : Dec 30, 2023, 11:01 AM IST
|Updated : Dec 30, 2023, 11:25 AM IST
World Largest Meditation Hall Varanasi : ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రమైన సర్వవేద ధ్యాన మందిరానికి పర్యటకులు పోటెత్తారు. డిసెంబర్ 18వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీద ప్రారంభమైన ఈ ధ్యాన మందిరాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది మంది తరలివస్తున్నారు. దీంతో ధ్యాన కేంద్రమంతా సందడిగా మారింది.
1000 కోట్ల రూపాయలతో దశలవారీగా నిర్మిస్తున్న ఈ ధ్యాన మందిర ప్రాంగణంలో ఒకేసారి 20వేల మంది ధ్యానం చేసుకునేలా నిర్మించారు. ఏడు అంతస్తుల మందిరాన్ని భారతీయ సనాతన ధర్మం, ఆచార సంస్కృతి ప్రతిబింబించేలా శిల్పకళతో నిర్మించిన ధ్యాన మందిరం భవిష్యత్తులో దేశానికే తలమానికంగా నిలుస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ మహామందిరంలో 125 తామర పూవు రేకుల గోపురాలు ఉన్నాయి. ఆ ఆలయంలో మకరానా పాలరాతిపై మొత్తం 3,137 శ్లోకాలను చెక్కారు. ఈ మందిర ప్రాంగణంలో ఔషధ మూలికలతో కూడిన అద్భుతమైన తోట కూడా ఉంది. ఈ మందిరంలో మొత్తం 101 ఫౌంటెన్‌లను ఏర్పాటు చేశారు. 2004లో ప్రారంభమైన ఈ మందిరం నిర్మాణంలో 15 మంది ఇంజనీర్లు, 600 మంది కార్మికులు పాల్గొన్నారు. మరింత సమాచారం వారణాసి నుంచి మా ప్రతినిధి మహేశ్ అందించారు. అవి ఆయన మాటల్లోనే.