మహిళను గొంతు నులిమి చంపడానికి దొంగ యత్నం- పర్సు, ఫోన్‌తో పరార్ - మహిళ గొంతు నులిమిన వీడియో
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-01-2024/640-480-20462142-thumbnail-16x9-woman-strangled-in-delhi-video.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Jan 8, 2024, 10:36 PM IST
Woman Strangled In Delhi Viral Video : దిల్లీలోని ద్వారకలో ఓ దొంగ కలకలం సృష్టించాడు. ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళను వెనుక నుంచి వచ్చి గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. అనంతరం పర్సు, ఫోన్ దొంగిలించి పారిపోయాడు. ఈ ఉదంతం జనవరి 6న ఉత్తమ్‌నగర్ ప్రాంతంలోని ఓ వీధిలో ఉదయం 6.30 గంటల సమయంలో జరిగింది. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని పట్టుకోవడం కోసం ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఆ బృందం సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసింది. అతడ్ని దిల్లీలోని చాణక్యపురికి చెందిన 38 ఏళ్ల శివ కుమార్‌గా గుర్తించింది. అయితే ఘటన జరిగిన రోజే నిందితుడిని అరెస్టు చేశామని ద్వారక డీసీపీ హర్ష వర్ధన్ తెలిపారు. కాగా నిందితుడిపై ఇదివరకే 6 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో తేలింది.