పర్యటకులను హడలెత్తించిన ఏనుగు- ఫొటోలు తీసేసరికి ఆగ్రహంతో దాడి - లఖీంపుర్ ఖేరీలో పర్యటకులను తరిమిన ఏనుగు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-11-2023/640-480-20092090-thumbnail-16x9-wild-elephant-attack-on-tourists-in-up-viral-video.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Nov 23, 2023, 10:33 AM IST
|Updated : Nov 23, 2023, 11:44 AM IST
wild Elephant Attack On Tourists In UP Viral Video : ఉత్తర్‌ప్రదేశ్‌లోని దుధ్వా టైగర్ రిజర్వ్ సందర్శనకు వెళ్లిన పర్యటకులను ఓ ఏనుగు వెంబడించింది. ఆ సమయంలో కొంతమంది పర్యటకులు సఫారీ కారులో ప్రయాణిస్తున్నారు. డ్రైవర్, టూరిస్ట్ గైడ్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది
లఖింపుర్ ఖేరిలోని దుధ్వా టైగర్ రిజర్వ్‌ను సందర్శించడానికి కొంతమంది పర్యటకులు సఫారీ కారు(జిప్సీకారు)లో వెళ్లారు. కొంచం దూరం వెళ్లేసరికి అక్కడ వారికి ఓ ఏనుగుల గుంపు కనిపించింది. ఆ పర్యటకుల్లో కొంతమంది గజరాజుల ఫొటోలను తీసేందుకు కారులోంచి కిందికి దిగారు. ఆ సమయంలో ఏనుగుల గుంపునుంచి ఓ గజరాజు పర్యటకులను వెంబడించింది. ఈ క్రమంలో జంగిల్ సఫారీ డ్రైవర్, గైడ్ అప్రమత్తతో టూరిస్ట్‌లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన కొందరు వన్యప్రాణి ప్రేమికులు ఘాటుగా స్పందించారు. అడవి జంతువులకు రెచ్చగొట్టేవిధంగా ప్రవర్తించరాదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.