ఘనంగా బావి-తోట పెళ్లి.. 1500 మంది అతిథులు.. ప్రభుత్వ ఉద్యోగులు సైతం! - వైరల్ వీడియోలు
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో బావికి, తోటకి పెళ్లి చేశారు. ఈ పెళ్లికి పత్రికలు అచ్చువేయించి చుట్టుపక్కల గ్రామస్థులను ఆహ్వానించారు. బావికి, తోటకి పెళ్లి చేసే ఈ వింత ఆచారం.. కైసర్‌గంజ్ ప్రాంతంలోని కద్‌సర్ బితౌరా గ్రామంలో ఉంది. ఈ వివాహ వేడుకలో మొత్తం 1,500 మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా.. బావి, తోట పెళ్లికి హాజరయ్యారు. ఇలా బావికి, తోటకి పెళ్లి చేయడం తమ సంప్రదాయంలో భాగమని 80 ఏళ్ల దేవి బక్ష్ సింగ్ తెలిపారు. తమ పూర్వీకుల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు దేవి బక్ష్ సింగ్ వెల్లడించారు. ఈ కార్యక్రమం చేయాలని చాలా రోజుల నుంచి అనుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికి తన కోరిక నెరవేరిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగా పెళ్లి చేసుకునే వారు ఈ బావి వద్దకు వచ్చి పూజలు చేస్తారని స్థానికులు వెల్లడించారు. మొత్తానికి ఈ పెళ్లి కహానీ కాస్త వింతగా ఉంది కదూ!