కిలోకు 800 గ్రాములే ఇస్తున్నారట - మాంసం ప్రియులారా కాస్త చూసుకొని తీసుకోండి - తూనికలు కొలత శాఖ తనిఖీలు
🎬 Watch Now: Feature Video
Published : Jan 7, 2024, 4:29 PM IST
|Updated : Jan 7, 2024, 4:38 PM IST
Weights and Measures Department Raids On Markets : మాంసం విక్రయ దుకాణాలు, రైతు బజార్లపై తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని పలుచోట్ల దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు. తనిఖీ చేసిన తర్వాత పలువురు వ్యాపారులపై 54 కేసులు నమోదు చేశారు. కొత్తపేట రైతుబజార్, పరిసర ప్రాంతాల్లో సుమారు 19 మందిపై కేసులు నమోదయ్యాయి. వికారాబాద్ పరిధిలో 29 కేసులు నమోదు అయ్యాయని అధికారులు చెప్పారు.
Raids On Markets in Hyderabad : తూకాల్లో పెద్ద ఎత్తున వ్యత్యాసం వచ్చినట్లు తూనికలు, కొలతల అధికారులు గుర్తించారు. దుకాణదారులు కిలోకు 800 గ్రాముల మాంసం మాత్రమే ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా పలు మాంసపు దుకాణాల్లో మోసానికి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ కంట్రోలర్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని 20 మంది సభ్యల బృందం పాల్గొంది. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్, కుషాయిగూడ, వికారాబాద్ సహా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.