ఉజ్జయినీ మహాకాలేశ్వరుడి సన్నిధిలో విరుష్క జంట పూజలు - ఉజ్జయినీ మహాకాలేశ్వరుడి ఆలయంలో విరాట్ పూజలు
🎬 Watch Now: Feature Video
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలోని మహాకాలేశ్వరుడి ఆలయాన్ని సందర్శించారు. మహాకాళేశ్వర్ ఆలయంలో విరుష్క జంట దర్శనం చేసుకుని పూజలు చేశారు. గర్భగుడి ప్రధాన ద్వారం వద్ద కూర్చుని భక్తులతో కలిసి భజనలు చేశారు. పంచెకట్టుతో మహాకాలేశ్వర్ ఆలయానికి వచ్చిన విరాట్ కోహ్లీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ 3 రోజుల్లోనే ముగియడం వల్ల దొరికిన కాస్త విరామంలో ఈ పరుగుల వీరుడు తన సతీమణితో కలిసి ఉజ్జయినీ ఆలయంలో ఇలా ప్రత్యక్షమయ్యారు.
అయితే ఈ జంటకు ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఇలాగే గతంలోనూ ఈ జంట ఉత్తరాఖండ్‌లోని బాబా నీమ్ కరౌలీ ధామ్ ఆశ్రమాన్ని కూడా సందర్శించారు. అక్కడి సంప్రదాయాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ జంట.. బాబా హారతిలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆ తర్వాత అదే ఆశ్రమంలో కాసేపు కూర్చుని హనుమాన్ చాలీసా పఠించారు. అయితే అక్కడికి కోహ్లీ తన ఫ్యామిలీతో వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు.. ఆలయానికి భారీగా చేరుకున్నారు. కానీ కోహ్లీ, అనుష్క.. ఫ్యాన్స్‌ను కలవకుండానే అక్కడి నుంచి ముక్తేశ్వర్‌కు పయనమయ్యారు. అంతకు ముందు కైంచి ధామ్ కమిటీ సభ్యులతో ముచ్చటించారు. అక్కడున్న వారితో ఫొటోలు దిగి సందడి చేశారు.
ఇక కెరీర్ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ ప్రస్తుతం బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్నాడు. కానీ తన ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో 12 రన్స్ స్కోర్ చేసిన ఈ రన్ మెషిన్.. రెండో టెస్ట్ 44,20 స్కోర్ చేయగా.. మూడో టెస్టుకు మూడో టెస్ట్ 22,13 రన్స్ తీశాడు. అయితే తొలి రెండు టెస్టులో గెలిచిన టీమ్ఇండియా.. మూడో మ్యాచ్‌లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.