సొరంగం సహాయక చర్యల్లో హైదరాబాదీల కీలక పాత్ర- ఏం చేశారంటే? - ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదం అప్డేట్
🎬 Watch Now: Feature Video
Published : Nov 29, 2023, 7:00 PM IST
Uttarakhand Tunnel Rescue Operation : ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు.. 17 రోజుల నిరీక్షణ తర్వాత సురక్షితంగా బయటకు వచ్చారు. అయితే, అనేక ఆటంకాల మధ్య సాగిన ఈ సహాయక చర్యల్లో హైదరాబాద్కు చెందిన ముగ్గురు సభ్యులు కూడా భాగస్వాములయ్యారు.
కార్మికులను కాపాడేందుకు భూమికి సమాంతరంగా గొట్టం వేసే క్రమంలో 25 టన్నుల ఆగర్ డ్రిల్లింగ్ యంత్రం సొరంగంలోనే ధ్వంసమైంది. ఫలితంగా డ్రిల్లింగ్ పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు చెందిన బోరోలెక్స్ సంస్థ ప్లాస్మా ఆధారిత కట్టింగ్ పద్ధతిలో గొట్టంలో ఇరుక్కుపోయిన యంత్ర భాగాలను తొలగించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానంలో ఉత్తరాఖండ్ తరలించింది కేంద్ర ప్రభుత్వం. తమ పనిని దిగ్విజయంగా పూర్తి చేసిన బృంద సభ్యులు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులు, సహాయక చర్యలపై బోరోలెక్స్ బృందంతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..