SBI ఏటీఎంలో భారీ చోరీ- స్కార్పియోలో వచ్చి నిమిషాల్లోనే నగదు మాయం - ఏటీఎంలో భారీ నగదు చోరీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-12-2023/640-480-20287802-thumbnail-16x9-uttarakhand-sbi-atm-robbery-cctv-video.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Dec 17, 2023, 11:18 AM IST
Uttarakhand SBI Atm Robbery CCTV Video : ఉత్తరాఖండ్‌లోని రూడ్కీలో ఓ ఎస్బీఐ ఏటీఎంలో భారీగా నగదు చోరీ జరిగింది. దుండగులు స్కార్పియో కారులో వచ్చి డబ్బులు కొట్టేశారు. గ్యాస్‌కట్టర్‌తో ఏటీఎం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. వారు రూ.15-17 లక్షలు నగదును ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
లక్సర్ రూడ్కీ రోడ్డులో ఉన్న ఓ శివాలయం ముందు ఎస్బీఐ ఏటీఎం ఉంది. శుక్రవారం అర్ధరాత్రి కొంతమంది దుండగులు స్కార్పియో కారులో వచ్చి ఏటీఎంలోకి వెళ్లారు. గ్యాస్‌కట్టర్‌ను ఉపయోగించి ఏటీఎంను పగల గొట్టారు. ఉదయం చూసేసరికి ఏటీఎం ధ్వంసం అయి ఉండడం వల్ల ఈ చోరీపై పోలీసులకు సమాచారం ఇచ్చారు బ్యాంకు అధికారులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దుండగులు ఏటీఎంలోని రూ.15-17 లక్షలను దోచుకెళ్లినట్లు సమాచారం. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ స్వపన్ కిశోర్ సింగ్ తెలిపారు.