భారీగా హిమపాతం.. ఇళ్లపై మంచు దుప్పట్లు.. కేదార్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు బంద్ - కేదార్‌నాథ్‌లో పొగమంచు
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో విపరీతంగా మంచు కురుస్తోంది. ఇళ్లు మంచు దుప్పటి పరిచినట్లు దర్శనమిచ్చాయి. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు -11.3 డిగ్రీల సెల్సియస్ నుంచి -3.8 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి.
మరోవైపు, వర్షం, అధిక హిమపాతం కారణంగా చార్‌ధామ్ యాత్రల్లో ఒకటైన కేదార్‌నాథ్ యాత్రకు రిషికేశ్, హరిద్వార్‌లలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. ఏప్రిల్ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్నారు. వాతావరణ పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. మరోవైపు.. మంగళవారం నుంచి కేదార్‌నాథ్ ధామ్ తెరుచుకోనుండగా.. భక్తులు తగిన జాగ్రత్తలతో చార్‌ధామ్ యాత్రకు రావాలని, వెచ్చదనాన్నిచ్చే దుస్తుల్ని తప్పనిసరిగా తెచ్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు..
ఈ ఏడాది ఫిబ్రవరిలో.. హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు కురిసింది. మంచు కారణంగా జాతీయ రహదారులు సహా 500 రోడ్లను మూసివేశారు. నీరు, విద్యుత్తు సరఫరాకు పలుచోట్ల అంతరాయం వాటిల్లింది. రోహ్‌తంగ్, అటల్ సొరంగం వంటిచోట్ల ఎకాఎకి 75 సెంటీమీటర్ల మంచు కురిసింది. హిమాచల్‌ప్రదేశ్ భారీ వర్షాలు కురిశాయి. ఆ రాష్ట్రంలో అనేకచోట్ల మైనస్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.