సీఎం అభ్యర్థిగా అధిష్ఠానం ఎవరి పేరు ప్రకటించినా నాకు నో ప్రాబ్లమ్ : ఉత్తమ్‌కుమార్ రెడ్డి - ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-12-2023/640-480-20191351-thumbnail-16x9-uttam.jpg)
![ETV Bharat Telugu Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Dec 5, 2023, 3:56 PM IST
Uttam Kumar Reddy Comments on CM Candidate : తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధిష్ఠానం ఎవరి పేరును ప్రకటించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దిల్లీ వెళ్లిన ఆయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. సీఎం అభ్యర్థి ఎంపిక సహా మంత్రివర్గ కూర్పుపై అధికారిక ప్రకటన రాని నేపథ్యంలో డీకేతో ఉత్తమ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
డీకేతో భేటీ అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం అభ్యర్థి ఎవరనేది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖరారు చేస్తారని తెలిపారు. ఎవరి పేరు ప్రకటించినా తనకు ఆమోదమేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే అది ఎప్పుడు అనేది త్వరలోనే నిర్ణయించి వెల్లడిస్తానని ఉత్తమ్ స్పష్టం చేశారు.