కుటుంబపాలనతో ఇంకా ఎన్నిరోజులు బాధ పడతారు - బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి : యోగి ఆదిత్యనాథ్ - యోగి ఆదిత్యనాథ్ రోడ్ షో
🎬 Watch Now: Feature Video


Published : Nov 26, 2023, 8:04 PM IST
UP CM Yogi Adityanath Road Show At Quthbullapur : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీజేపీ పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌కు మద్దతుగా ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రోడ్‌షోలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా భారీగా కార్యకర్తలను సమీకరించారు. దీంతో కుత్బుల్లాపూర్ రహదారులన్నీ కాషాయమయం అయ్యాయి. రోడ్‌షోలో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ల్యాండ్ మాఫియా నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి కుటుంబపాలన రాజ్యమేలుతుందని.. వీరితో ఇంకా ఎన్ని రోజులు బాధ పడతారని వ్యాఖ్యానించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్ర ప్రజల జీవితాలను మారుస్తుందని తెలిపారు. అయోధ్యలో రామ మందిరాన్ని ఎలా నిర్మిస్తున్నామో.. రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అవకాశమిస్తే ప్రజల ఆశయాలను అలాగే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉగ్రవాదుల ఆట కట్టించామన్నారు. భారత దేశం వైపు చూడాలంటేనే ఉగ్ర మూలాలకు వెన్నులో వణుకుపుడుతుందని పేర్కొన్నారు. ఒక్కసారి బీజేపీకి పార్టీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని కోరారు.