ఒకేసారి 2లక్షల మంది నోట 'వందేమాతరం'.. ప్రపంచ రికార్డు దాసోహం.. ఎక్కడంటే? - vandematam record video

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 11, 2023, 8:47 PM IST

Updated : Aug 11, 2023, 9:40 PM IST

Two lakh People Sing Vandemataram : ఒకే వేదికపై 50వేల మంది ప్రజలు.. జాతీయ గేయాన్ని(వందేమాతరం) ఆలపించి ప్రపంచ రికార్డు సాధించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థులు, రాజకీయ నాయకులు, సామాజిక సంస్థల నిర్వాహకులతో పాటు మరో ఆరు రాష్ట్రాలకు చెందిన దాదాపు 2 లక్షల ప్రజలు ఆన్​లైన్ ద్వారా​ పాల్గొన్నారు. మరి ఈ అద్భుతమైన కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే?

ఛత్తీస్​గఢ్ రాష్ట్రం రాయ్​పుర్ సైన్స్ కాలేజ్ ఆవరణలో శుక్రవారం ఉదయం సామూహిక జాతీయ గేయ ఆలాపన జరిగింది. స్థానికంగా ఉన్న 'ఓం మండలి శివశక్తి అవతార్ సేవా సంస్థాన్ వసుదైక కుటుంబం ఫౌండేషన్' నిర్వాహకులు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముందు నిర్వాహకులు 'మేరీ షాన్ వందేమాతం' అనే సందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు త్రివర్ణ పతాక చీరలు ధరించారు. వారంతా కలశాలను చేతిలో పట్టుకొని.. అమపర నుంచి సైన్స్​ కాళాశాల దాకా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఛత్తీస్​గఢ్ సంస్కృతీ సంప్రదాయాలు.. కార్యక్రమానికి హైలైట్​గా నిలిచాయి. 

Last Updated : Aug 11, 2023, 9:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.