Train Derailed In UP : పట్టాలు తప్పిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. అంతా సేఫ్.. కానీ! - యూపీలో పట్టాలు తప్పిన ట్రైన్ ప్రయాణికులు సేఫ్
🎬 Watch Now: Feature Video
Published : Nov 1, 2023, 7:31 AM IST
Train Derailed In UP : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్ సమీపంలో సుహైల్‌దేవ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఘాజీపుర్ నుంచి దిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్‌కు వెళ్తున్న సుహైల్‌దేవ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ సహా మరో రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
త్రుటిలో తప్పిన ఈ పెను ప్రమాదం గురించి విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తిస్తామని ఉత్తర మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టామని.. మిగతా రైళ్ల రాకపోకలు సాధారణంగానే జరుగుతున్నాయని ఆయన చెప్పారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే రైలు ప్రయాగ్‌రాజ్ స్టేషన్ నుంచి బయలుదేరిందని.. ఆ సమయంలోనే ప్లాట్పామ్ నెంబర్ 6 వద్ద ఈ ఘటన జరిగిందని అధికారులు వివరించారు.