ఏ ఎగ్జిట్ పోల్ చూసినా తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం : రేవంత్‌రెడ్డి - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 30, 2023, 8:59 PM IST
TPCC Chief Revanth Reddy on Election Poll in Telangana : ఏ ఎగ్జిట్ పోల్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం రాదని చెప్పలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్‌కు అధికారం వస్తుంది కానీ మెజారిటీలో కొంచెం హెచ్చుతగ్గులు వస్తాయని చెబుతున్నాయని తెలిపారు. అంతేగానీ ఏ ఎగ్జిట్ పోల్ కూడా అధికారం రాదని చెప్పడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల నాడీ అందరికీ ఒకే రకంగా ఉందన్నారు.
Telangana Election Polls 2023 : ఎన్నికల ఫలితాలు వారికి అనుకూలంగా లేవని.. బీఆర్‌ఎస్ అధినేత పత్రికల ముందుకు కూడా రావడానికి ముఖం చాటేశారని విమర్శించారు. కేటీఆర్ వచ్చి మాట్లాడారంటే కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకునేందుకు డిసెంబరు 3 వరకు ఆగాల్సిన అవసరం లేదని.. ఈరోజు నుంచే సంబురాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కాకపోతే కాంగ్రెస్ శ్రేణులు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఓడినవాడు బానిస కాదు.. గెలిచినవాడు రాజు కాదన్నారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద ఆధిపత్యం చేలాయించని ఈ సందర్భంగా చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఈరకంగా మాట్లాడారు.