Prathidwani : ధాన్యం కొనుగోళ్లు.. కుదరని లెక్కలు
🎬 Watch Now: Feature Video
Today prathidwani on paddy procurement in telangana : ఆరుగాలం శ్రమించి పంటలు పండించే అన్నదాతకు అడుగడుగునా కష్ట, నష్టాలు తప్పడం లేదు. చివరికి ధాన్యం అమ్ముకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వడగళ్ల వానతో వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కోతలు పూర్తయ్యాక ధాన్యం నిల్వ చేసి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా అమ్మకానికి సిద్ధం చేసుకున్నారు. కానీ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత మిల్లర్లు నాణ్యత, తాలు పేరిట కోతలు విధిస్తున్నారు.
రికార్డు స్థాయిలో వరి దిగుబడులు సాధించిన రాష్ట్రంలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా జరగడం లేదు. కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు ధర్నాలు, రాసారోకోలు నిర్వహిస్తున్నారు. రోడ్లపై ధాన్యం తగులబెడుతూ నిరసనలు చేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది. గత యాసంగితో పోలిస్తే ఈసారి సాగు కూడా పెరిగింది. కానీ అకాల వర్షాలతో పెద్ద మొత్తంలో వరి పంట తీవ్రంగా దెబ్బతింది. దీంతో పౌరసరఫరాల శాఖ కొనుగోళ్ల లక్ష్యాన్ని కుదించింది. కొనుగోళ్ల లక్ష్యం తగ్గించడం వల్ల రైతులకు ఇబ్బంది కాదా? ఇకనైనా ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? అసలు ఎందుకీ పరిస్థితి? పరిష్కారం ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.